మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Oct 19 2024 3:12 AM | Updated on Oct 19 2024 11:02 AM

-

మామే చంపాడంటూ మృతురాలి సోదరుడి ఫిర్యాదు 

నందికొట్కూరు: మండల పరిధిలోని నాగటూరు గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. నాగటూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు, శిరీష (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

కాగా శుక్రవారం మొక్కజొన్న పొలం పనులకు వెళ్లిన శిరీషను సొంత మామ గొల్ల కురుమన్న హత్య చేసినట్లు తెలుస్తోంది. పంట కోత కోసిన చేనులో కంకులు ఏరుతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిరాలి సోదరుడు అశోక్‌ ఫిర్యాదు మేరకు మామపై హత్య కేసు, భర్త నరసింహులు, అత్త మహేశ్వరి, ఆడపచులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు టౌన్‌ సీఐ తెలిపారు. కాగా గొల్ల కురుమన్నపై 2017లో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కురుమన్నను ఎన్‌కౌంటర్‌ చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement