
అర్జీలు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సృజన, జేసీ నారపురెడ్డి మౌర్య
కర్నూలు(అర్బన్): జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ సృజన ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ అందజేయాలన్నారు. ఈ ప్రక్రియ వల్ల అర్జీదారుల్లో సంతృప్తి స్థాయి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నాగప్రసన్నలక్ష్మి, రమ, అనురాధ, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
స్పందనకు వచ్చిన అర్జీల్లో కొన్ని ....
● తనకు 3.90 ఎకరాల భూమి ఉందని, ఆన్‌లైన్‌లో వేరే వారి పేరిట నమోదు చేశారని, సమస్యను పరిష్కరించాలని కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన బోయ లింగన్న వినతిపత్రం సమర్పించారు.
● తనకు1.83 ఎకరాల భూమి ఉందని, ఆన్‌లైన్‌లో ఒక ఎకరా మాత్రమే నమోదైందని, మిగిలిన 83 సెంట్లను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన బోయ అశోక్ కోరారు.
● తనకు 1.45 ఎకరాల భూమి ఉందని, రీ సర్వేలో 1.54 ఎకరాలు చూపించారని, ఉన్న భూమినే స్థిరంగా చూపించాలని గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన ఎం రజనీకుమార్ వినతి పత్రం అందించారు.
● తనకున్న 1.53 ఎకరాల భూమిని తన కుమారులకు దాన విక్రయం చేయించానని, ఆన్‌లైన్‌లో తన కుమారుల పేర్లు నమోదు చేయించాలని దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన టీ చిన్నప్ప కోరారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ సృజన