మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ సీఎం నారా చంద్రబాబునాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద కొలువై ఉన్న అపరాజిత అమ్మవారిని చంద్రబాబునాయుడు దంపతులు దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురవాలని, కరువును ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని వేడుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ సుమారు లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
కాగా ఉత్సవాలలో ఏడో రోజైన శనివారం దుర్గమ్మ వారు శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించడం వల్ల అష్టైశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని భక్తుల విశ్వాసం.


