ఇండస్ట్రియల్ విజిట్స్ విద్యార్థులకు ఉపయోగం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పుస్తకాల్లో చదువుకున్న అంశాలు పరిశ్రమల్లో ఎలా అమలవుతాయనే విషయాలను స్వయంగా చూసి జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇండస్ట్రియల్ విజిట్స్ విద్యార్థులకు ఉపయోగపడతాయని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్ చైర్మన్ జయంత్ ఉప్పులూరి చెప్పారు. ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్, స్టాండ్స్ ఫర్ ది సదరన్ ఇండియా చార్డర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అసోసియేషన్(సికాసా) సంయుక్త ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ విజిట్ శుక్రవారం జరిగింది. అందులో భాగంగా నగరంలోని వీఎం బేకరీ ప్రొడక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ను చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) విద్యార్థులు సందర్శించారు. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి ప్రక్రియలు, యాజమాన్య నిర్వహణ, కాస్టింగ్, అకౌంటింగ్ విధానాలు, సరఫరా వ్యవస్థలపై ప్రత్యక్ష అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జయంత్ ఉప్పులూరి అన్నారు. సికాసా విజయవాడ బ్రాంచ్ చైర్మన్ అజయ్ చౌదరి బొర్రా మాట్లాడుతూ ఇలాంటి విజిట్స్లో యువత పాల్గొంటే చదువు పూర్తయ్యాక పరిశ్రమల్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే విషయాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ కార్యదర్శి వేమూరు వీర పవన్ కుమార్,వైస్ చైర్మన్ మనీష్ కుమార్ జైన్, కోశాధికారి టి.వినీల, ఎంసీ సభ్యులు దామా వేణు, కె.నారాయణ తదితరులు పాల్గొన్నారు. తప్పిపోయిన బాలిక
తల్లి చెంతకు లబ్బీపేట(విజయవాడతూర్పు): తప్పిపోయిన బాలికను తల్లి చెంతకు చేర్చారు పోలీసులు. సింగ్నగర్ ప్రాంతానికి చెందిన బాలిక తల్లితో కలిసి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి రాగా, క్యూలో రద్దీ తీవ్రంగా ఉండటంతో వారి నుంచి తప్పిపోయింది. ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రాని మనోజ్ఞ తప్పిపోవడంతో తల్లి శారద కళ్లు తిరిగి పడిపోయింది. బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐ ప్రమీల వెంటనే ఆ తల్లికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వివరాలు తెలుసుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీ పుటేజిని నిశితంగా పరిశీలించి బాలిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. దీంతో పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో వెళ్లి బాలికను గుర్తించి పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సమక్షంలో తల్లి చెంతకు చేర్చారు. సమయానుకూలంగా స్పందించి చిన్నారిని తల్లిదండ్రులకు చేర్చడానికి చర్యలు చేపట్టిన ఎస్ఐ ప్రమీల, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆహారభద్రత దిశగా అడుగులు నిత్యాన్నదానం ట్రస్టుకు విరాళం
అప్పగించిన పోలీసులు
చల్లపల్లి: ఆహార వృథాను తగ్గించి ఆధునిక సాంకేతికతతో సంప్రదాయ జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అందరికీ ఆహార భద్రత కల్పించే దిశగా కలిసి ముందుకు సాగాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని వక్కలగడ్డ కమలా నెహ్రూ మహిళా మండలి కార్యాలయంలో శుక్రవారం ‘నేటి నూతన ఆవిష్కరణలు–రేపటి పోషకాహారం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సుధారాణి మాట్లాడుతూ పర్యావరణ హితమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను వివరించారు. కేవీకే శాస్త్రవేత్తలు జి.కృష్ణవేణి, వక్కలగడ్డ గ్రామ మహిళలు పాల్గొన్నారు.
మోపిదేవి: కాకినాడ జిల్లా తుని మండలం అన్నవరానికి చెందిన భక్తులు పన్నీరు బాబ్జి, భాస్కర్ శ్రీహరి శుక్రవారం మోపిదేవి సుబ్రహ్యణ్వేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,01,116 విరాళం అందజేశారు. ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్చుత మధుసూదనరావుకు అందజేశారు. దాతలను ఆలయ సూపరింటెండెంట్ సత్కరించారు.