పీజీఆర్‌ఎస్‌లో 118 అర్జీల స్వీకరణ కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్‌ఎస్) జరిగింది. కలెక్టర్‌తో పాటు డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, మెప్మా పీడీ పి.సాయిబాబు, డీఎస్పీ ఆర్.అభిషేక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిష్కరించటంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో అధికారులు మొత్తం 118 అర్జీలను స్వీకరించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..


