నేతన్న సేవలో పథకం అమలులో నేత కార్మికు లకు తీరని అన్యాయం జరిగింది. లబ్ధిదారుల్లో చాలా మంది అనర్హులు ఉన్నారని గుర్తించాం. అసలు అర్హుల జాబితాలను ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదు. లబ్ధిదారులను గుర్తించడంలో పారదర్శక పాటించలేదు. అధికారులు నిష్పక్షపాతంగా నడుచుకుని జాబితాలను ప్రదర్శిస్తే అనర్హులను గుర్తించి, వివరాలు అందజేస్తాం. లేదా అధికారులే విచారణ చేసి అనర్హులను తొలగించాలి.
– కటకం ప్రసాద్,
సీనియర్ మాజీ కౌన్సిలర్, పెడన


