కోనేరుసెంటర్: మీ కోసంలో అందిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఎస్పీ సావధానంగా ఆలకించారు. ముఖ్యంగా వృద్ధుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. మీ కోసంలో మొత్తం 56 ఫిర్యాదులు అందుకున్నారు.


