కృష్ణా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
కోనేరుసెంటర్: రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందంటే దానికి ప్రధాన కారణం సిబ్బంది పనితీరు, సమష్టి కృషి అని ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన పలువురు పోలీసు అఽధికారులు, సిబ్బందిని సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ.. ఉద్యోగ బాధ్యతలో భాగమేనన్నారు. సర్వీసులోకి వచ్చినపుడు ఎంత సంతోషపడతామో సంపూర్ణ ఆరోగ్యంతో పదవీ విరమణ పొందేటప్పుడు అంతే ఆనందంగా ఉండాలన్నారు. నేరాల నియంత్రణలో జిల్లాకు అత్యంత గుర్తింపు తీసుకురావడంలో మీరంతా చేసిన కృషి పడిన కష్టం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అనంతరం ఆయన పదవీ విరమణ పొందిన డీటీసీ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, ఎస్సై హనుమంతరావు, ఉమెన్ ఎస్సై టి.వెంకటరమణ, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సిబ్బందికి పోలీసుశాఖ తరఫున అందాల్సిన ప్రయోజనాలు వీలైనంత త్వరగా చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, ఏఆర్ ఆర్‌ఐ రవికిరణ్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్మకూరు(పామర్రు): తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్ చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు తెలుగు సంస్కృతి అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృత సప్తాహ మహోత్సవాలు ఏపీలో జరిగాయి. దీనిలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌ఎస్‌ల నిర్వహణలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్ర జరిగింది. టీటీడీ కమ్యూనిటీ హాల్ విద్యార్థులు సంస్కృత భాష గొప్పదనాన్ని వివరించారు. అనంతరం పలువురిని సత్కరించారు. ఏపీఆర్‌జెసీ కళాశాల ప్రధానాచార్యులు సాంబశివరావు, ఏపీ గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు మండలి బ్రహ్మణేశ్వరమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ముకుంద జ్యూవెలరీ ఫ్యాక్టరీ ఔట్‌లెట్ విజయవాడలో ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు నాణ్యమైన బంగారు, వజ్రాభరణాలను మరింత అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రారంభోత్సవ అమ్మకాల్లో 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 6.99 శాతం వీఏ, జీరో మేకింగ్ చార్జీలు వంటి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలపై 2 నుంచి 12 శాతం వరకు వీఏ, హాల్‌మార్క్ గోల్డ్ జ్యువెల్లరీ, స్టోన్స్ ఉన్న ఆభరణాలపై 65 శాతం వరకు ఎక్సేంజ్ విలువ అందిస్తున్నట్లు చెప్పారు. డైమండ్ ఆభరణాలపైకూడా 25 శాతం వరకు వీఏ ఆఫర్‌తోపాటు క్యారెట్‌కు రూ.48,450 నుంచి ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయని నరసింహారెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రారంభోత్సవ సేల్‌ను నగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


