డెక్క కాడలతో కళాకృతులు! | - | Sakshi
Sakshi News home page

డెక్క కాడలతో కళాకృతులు!

Sep 1 2026 3:12 AM | Updated on Sep 1 2026 3:12 AM

పెడన: చెరువు డెక్కతో ఇంటీరియల్‌ టచ్‌ ఇస్తున్నారు. అదెలా అంటే.. పంట కాలువల్లో, ఊర చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఎందుకూ పనికి రాదనుకుంటున్న వారికి దాంతో కూడా కొన్ని రకాల వస్తువులు తయారు చేయవచ్చని గుర్తించి తీసుకెళ్తున్నారు. కూలీలుగా వచ్చి గుర్రపు డెక్క పచ్చిగా ఉన్న దానిని కాడ నుంచి ఆకులను వేరు చేసి కాడలను కట్టగా కట్టి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే ప్రశ్నకు వారంతా బంటుమిల్లి మండలం ఆర్తమూరు నుంచి వచ్చినట్లు తెలిపారు. ఎక్కడకు తీసుకువెళ్తున్నారు, ఎవరికి ఇస్తారనే దానికి మాత్రం వారి నుంచి సమాధానం లేదు. బంటుమిల్లి మండలం లేళ్లగూడెంలో కొందరు డ్వాక్రా మహిళలు ఇంటీరియల్‌ డిజైన్లు కళాకృతులను తయారు చేయడానికి వీటిని తీసుకురమ్మన్నారని, మేం కూలీలు మాత్రమేనని వారు చివరకు తెలపడం గమనార్హం. ఈ గుర్రపు డెక్క కాడ నుంచి నార వలె ఉన్న దానిని తీస్తారు. దాన్ని ఎండబెట్టి ఇంటీరియల్‌ డిజైన్‌కు వినియోగిస్తున్నారు. ఎండబెట్టిన గుర్రపు డెక్క కేజీ రూ.70 వరకు పలుకు తుంది. ఈ ఎండబెట్టిన గుర్రపు డెక్క కళాకృతులను రూపొందిస్తుండటంతో అవి బాగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో మచిలీపట్నం మండలం చిన్నాపురంలో మొదలైన శిక్షణ ఆ తర్వాత పెడన మండలం చేవేండ్రలో కొందరు శిక్షణ పొందారు. అలాగే ప్రస్తుతం బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచాయతీ లేళ్లగూడెం గ్రామాల్లో డ్వాక్రా మహిళలు శిక్షణ పొందుతున్నారు. అక్కడకు వీటిని తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement