మీసం మెలేసిన | - | Sakshi
Sakshi News home page

మీసం మెలేసిన

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026 u8లో మీసం మెలేసిన ● రొయ్యల చెరువులో మ్యాజిక్‌ చేసిన ఆక్వా కల్చరిస్ట్‌ సునీల్‌ ● రాష్ట్రంలోనే ప్రథమంగా కేజీకి 10 రొయ్యల దిగుబడి సాధించిన దివిసీమ రైతు ● చిన్నపాటి చెరువుల యాజమాన్యంతో సత్ఫలితాలు ● తొమ్మిది నెలల కృషి ఫలితమని ఆనందోత్సాహాలు టైగర్‌ రొయ్యల సాగులో పది కౌంట్‌ దిగుబడి పొందడం ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి మా ప్రాంతంలో రొయ్యల చెరువుల్ని చూసేవాడిని. రొయ్యల పెంపకంపై ఆసక్తితో ఎమ్మెస్సీ ఆక్వా కల్చర్‌ పూర్తి చేశాను. ఆ తరువాత ఆక్వా కంపెనీలో టెక్నికల్‌ అడ్వైజర్‌గా పనిచేశాను. 2015 నుంచి రొయ్యల సాగు చేస్తున్నాను. చెరువులో వీలైనంత తక్కువ రొయ్యలు ఉండేలా చూసుకున్నాను. ఎకరానికి 800–1000 కేజీల వరకు పట్టుబడికి ప్రిపేర్‌ అయ్యాను. తద్వారా పది కౌంట్‌కు వెళ్లగలిగాను. చెరువులోకి ఎటువంటి డిసీజ్‌ రాకుండా బయో సెక్యూరిటీ ఉండేలా చూసుకున్నారు. – బండి వెంకట నాగసునీల్‌, మచిలీపట్నం నాగాయలంక: సాధారణంగా రొయ్యల సాగులో 30 కౌంట్‌ (కేజీకి 30 రొయ్యలు) దిగుబడి సాధిస్తే ఆ రైతు పంట పండినట్టే. అక్కడక్కడా కొందరు రైతులు 20 కౌంట్‌ దిగుబడి సైతం సాధిస్తుంటారు. కానీ.. కేజీకి 10 రొయ్యలు(10 కౌంట్‌) సాధించి టైగర్‌ రొయ్యల సాగులో రాష్ట్రంలోనే కొత్త రికార్డు నెలకొల్పాడు ఓ యువరైతు. మచిలీపట్నానికి చెందిన రైతు బండి వెంకటనాగసునీల్‌ నాగాయలంక మండలం టి.కొత్తపాలెం పరిధిలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో టైగర్‌ రొయ్యల సాగులో అద్భుత విజయం సాధించారు. ఎమ్మెస్సీలో ఆక్వా కోర్సులో పట్టభద్రుడైన సునీల్‌ రొయ్యల్లో అధిక ధర లభించే ‘టెన్‌ కౌంట్‌’ దిగుబడి ఇక్కడ ఎందుకు సాధించలేమనే పట్టుదలతో ముందుకు సాగారు. 12 ఎకరాల్లో ‘పాండ్స్‌ మేనేజ్‌మెంట్‌’ విధానంలో యాజమాన్య పద్ధతులు పాటించి బుధవారం తొలి పట్టుబడిలో ‘10 కౌంట్‌’ దిగుబడి తీశారు. 9 నెలల కృషికి ఫలితం లభించడంతో అతడి ఆనందం అవధులు దాటింది. ఈ జాగ్రత్తలు పాటించి.. కేజీకి రూ.490 ఖర్చు.. రూ.1,150 ఆదాయం

న్యూస్‌రీల్‌

రైతు కృషి ఇలా సాగింది..

సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026
u8లో

● సాధారణంగా రొయ్యల చెరువులు ఎకరంన్నర నుంచి ఐదెకరాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటాయి.

● అయితే, సునీల్‌ ప్రతి చెరువును ఎకరం కంటే తక్కువ విస్తీర్ణంలో చిన్నపాటి చెరువులు ఉండేలా నిర్మించారు.

● చెరువును దున్నిన తర్వాత రెండు నెలలు బాగా ఆరబెట్టారు. తగినంత మినరల్స్‌ (జిప్సం, సున్నం వంటివి) నీళ్లు పెట్టకముందే నేలకు ఇచ్చారు. తద్వారా భూమి సాంద్రత బాగా ఉండేలా చూశారు.

● ప్రతినెలా నీటిని మారుస్తూ మినరల్స్‌ ఇస్తూ వచ్చారు.

● ప్రతి ఐదు రోజులకు చెరువుల్లో ప్రో బయోటిక్‌ వినియోగించి రొయ్యలకు మేలు చేకూరేలా చూసుకున్నారు.

● రొయ్యల్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచేలా నీటిని మార్చుకునేందుకు వీలుగా రెండు రిజర్వాయర్ల విధానాన్ని పాటించారు.

● ఆటో ఫీడర్స్‌ ద్వారా చెరువుల్లోని రొయ్యలకు మేత అందించారు. తద్వారా చెరువులు కాలుష్యం బారిన పడకుండా చూసుకున్నారు.

● కేజీ రొయ్యల పెంపకానికి ఎఫ్‌సీఆర్‌ 2.2, ఫీడ్‌ రూ.220, ఇతరత్రా ఖర్చు రూ.270 చొప్పున వెచ్చించారు.

● మొత్తం అన్ని ఖర్చులు కలుపుకుంటే కేజీ రొయ్యల పెంపకానికి రూ.490 చొప్పున అయ్యింది.

● దిగుబడి 10 కౌంట్‌ సాధిస్తే కేజీ రొయ్యలకు రూ.1,150 నుంచి రూ.1,200 ధర లభిస్తుంది.

చెరువులో రొయ్యలు పడుతున్న కూలీలు

9 నెలల క్రితం సీడ్‌ తెచ్చి నర్సరీ పాండ్స్‌లో ఎకరానికి 5 లక్షల చొప్పున రొయ్య పిల్లల్ని వదిలారు.

45 నుంచి 50 రోజులపాటు ఆ పిల్లల్ని నర్సరీ పాండ్స్‌లోనే పెంచి ఆ తరువాత ప్రధాన చెరువుల్లో ఎకరానికి 40 వేల చొప్పున వేశారు.

5 నెలల తర్వాత 50శాతం మధ్యంతర పట్టుబడి చేసి ఒక టన్ను వరకు విక్రయించారు.

అనంతరం 8 నెలల తరువాత మరో 1,500 కేజీల దిగుబడి తీశారు. తద్వారా మొత్తం రొయ్యల్లో 85 నుంచి 87 శాతం సర్వైవల్‌ పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement