విజయవాడ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న గరుడాళ్వార్ ప్రతిష్టాపనా మహోత్సవాలు వేదోక్తంగా సాగుతున్నాయి. ఆదివారం నాటి కార్యక్రమంలో దేవాలయంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాపనా మహోత్సవాల్లో భాగంగా ఉదయం అష్టబంధన ద్రవ్యారాధన, అంగహోమం, జలాధివాసం, అంగహోమం, గరుడ బింబస్థాపన, మహాశాంతి హోమం నిర్వహించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలితా రమాదేవి పర్యవేక్షించారు.


