ధనలక్ష్మిగా ముత్యాలమ్మవారు | - | Sakshi
Sakshi News home page

ధనలక్ష్మిగా ముత్యాలమ్మవారు

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

ధనలక్ష్మిగా ముత్యాలమ్మవారు నేడు, రేపు ఐసెట్‌ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో సోమ, మంగళవారాల్లో ఐ–సెట్‌–2026కు దరఖాస్తు చేసుకున్న స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి ఐసెట్‌–2026ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మే 2వ తేదీన పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులు ఈ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు స్వయంగా వచ్చి వారి సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకుంటారు. సాధారణ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆన్‌లైన్‌లో పూర్తి చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్‌ఆప్షన్లకు మార్పులు, చేర్పులకు సెప్టెంబర్‌ 3వ తేదీన అవకాశం ఉంటుందని హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ ఎం. విజయసారథి ఆదివారం వివరించారు. సెప్టెంబర్‌ 7వ తేదీన సీట్‌ ఎలాట్‌మెంట్‌ను ప్రకటిస్తామని తెలియజేశారు. సెప్టెంబర్‌ 8 నుంచి 11వ తేదీలోగా సీట్‌ ఎలాట్‌మెంట్‌ అయిన కళాశాలకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని చెప్పారు. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన విశాఖపట్నం మైలవరం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో మైలవరం డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏపీఎఫ్‌ఏ సీనియర్‌ మెన్‌–2026–ఏపీ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ మూడో రోజు పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. విశాఖపట్నం జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌ పోటీలతో మైదానం హోరెత్తగా క్రీడాకారులు విజయం కోసం చివరి నిమిషం వరకు పోరాడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. మూడో రోజు పోటీలకు ఏఎంసీ చైర్మన్‌ నవ్యశ్రీ, ఎన్‌టీఆర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై. శేషగిరిరావు, కృష్ణా జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన జానకీరామ వెంకట్‌ విఠల్‌ సాయితేజరాజు రూ. లక్ష, అనంత ఇషాన్‌ రూ. లక్ష మొత్తం రెండు లక్షలు ఆదివారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు ఈ విరాళాన్ని అందించారు. ఈ సందర్బంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

జగ్గయ్యపేట అర్బన్‌: శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీముత్యాలమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారు శ్రీధన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం కుమ్మరి శాలివాహన వంశస్తులు అమ్మవారిని, ఆలయ గర్భగుడిని రూ. 7లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అప్పన మణికుమార్‌, కొత్తా రమేష్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు నోముల శివకుమార్‌, సంయుక్త కార్యదర్శి కొంకిమళ్ల సురేష్‌, కోశాధికారి అప్పన వెంకట పిచ్చయ్య, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement