కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు బుధవారం విఽడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి ఏప్రిల్ ఒకటో తేదీలోగా వెబ్‌సైట్‌లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు.


