వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి

Mar 16 2026 8:36 AM | Updated on Mar 16 2026 8:36 AM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పెనమలూరు: వినియోగదారులకు హక్కులపై అవగాహన కల్పించాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కానూరులో ఆదివారం సిద్ధార్థ లా కాలేజీ, ఏపీ కన్స్యూమర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన, సాధికారతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంరక్షణకు అనేక చట్టాలు ఉన్నా హక్కులపై అవగాహన లేక మోసాలకు గురవుతున్నారని తెలిపారు. నేడు సమాజంలో నిబద్ధత, పారదర్శకత లోపిస్తోందని, అవినీతి, కల్తీ పెరిగిందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జి.రామకృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్‌, విద్యా, వైద్యరంగంపై వినియోగదారులకు అవగాహన లేక పోవడంతో మోసాలకు గురవుతున్నారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి మాట్లాడుతూ విద్య, వైద్యం వ్యాపారంగా మారాయన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు ఎం.రాజయ్య, లా కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు, ప్రో ఉపకులపతి డాక్టర్‌ రత్నప్రసాద్‌, బార్‌ అధ్యక్షుడు మన్నే హరిబాబు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement