దుర్గమ్మ సేవలో జస్టిస్‌ బాలాజీ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో జస్టిస్‌ బాలాజీ

Mar 16 2026 8:35 AM | Updated on Mar 16 2026 8:35 AM

దుర్గమ్మ సేవలో జస్టిస్‌ బాలాజీ దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి ప్రశాంతంగా ‘అక్షర ఆంధ్ర’ పరీక్ష మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో ‘అక్షర ఆంధ్ర–ఉల్లాస్‌’ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసెస్మెంట్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) ప్రశాంతంగా జరిగిందని డెప్యూటీ డైరెక్టర్‌ మహమ్మద్‌ హాజీ బేగ్‌ తెలిపారు. ఆదివారం పరీక్ష కేంద్రాలను రాష్ట్ర వయోజన విద్యాశాఖ సంచాలకులు పి. రంజిత్‌ బాషా సందర్శించి కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో అభ్యాసకులు పరీక్ష రాస్తున్న విధానాన్ని పరిశీలించారన్నారు. ఉత్తీర్ణులైన వారికి ఎన్‌ఐఓఎస్‌ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ సమీక్ష.. పరీక్ష అనంతరం జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ హాజరు శాతంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 73,237 మంది అభ్యాసకులకు 980 పరీక్షా కేంద్రాల్లో 1,040 మంది ఇన్విజిలేటర్ల సమక్షంలో పరీక్ష నిర్వహించగా 97శాతం మంది హాజరైనట్లు తెలిపారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మెడపల్లి బాలాజీ కుటుంబ సమేతంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అర్చకులు, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కోమరిగిరిపట్నంకు చెందిన కొప్పాడి రమేష్‌ కుటుంబం రూ. 2.50లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచొద్దని నిరుద్యోగ వ్యవసాయ యువ శాస్త్రవేత్తల బృందం డిమాండ్‌ చేసింది. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ బాలకృష్ణ, డాక్టర్‌ కిరణ్‌ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ప్రొఫెసర్లు వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని వివిధ సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఇప్పటికే 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో దశాబ్ద కాలంగా ఎటువంటి నియామకాలు జరగలేదన్నారు. దీంతో వ్యవసాయ, అనుబంధ అత్యున్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారి నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 65 ఏళ్ల ఉద్యోగ విరమణ అంశమే లేదని, మరి మన రాష్ట్రంలో పెంచడం ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో యువ శాస్త్రవేత్తలు రాజేష్‌, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement