ట్యాంకర్లతో వాడకం నీరు సరఫరా | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్లతో వాడకం నీరు సరఫరా

Mar 13 2026 9:00 AM | Updated on Mar 13 2026 9:00 AM

ట్యాంకర్లతో వాడకం నీరు సరఫరా

నగరపాలక సంస్థ రోజూ నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు వాటర్‌ ట్యాంకర్లు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి బ్లాకులో ఉన్న వాటర్‌ సంప్‌లోకి ఆ నీటిని డంప్‌ చేస్తారు. ఒక్కో సంప్‌ నిండాలంటే కనీసం రెండున్నర ట్యాంకర్ల అవసరం అవుతాయి. సంప్‌ నిండిన తరువాత మోటారు వేస్తే ఆ బ్లాక్‌ టెర్రస్‌పై ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లోకి నీరు చేరుతుంది. ఆ నీటిని బ్లాకులో ఉండే 32 ఫ్లాట్లలో నివసించేవారు వాడుకోవాల్సి ఉంటుంది. మోటారు వేసినప్పుడు వచ్చే కరెంట్‌ బిల్లు ఆయా ఫ్లాట్లలో ఉండేవారు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ట్యాంకర్ల ద్వారా వచ్చేవి మంచినీరే అయినా సంప్‌లోకి వచ్చే సరికి తాగేందుకు పనికిరాదు. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్‌ నుంచి కూడా సంప్‌ల్లోకి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. తాగేందుకు మాత్రం మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల నుంచి క్యాన్లు కొనుగోలు చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement