నిశ్శబ్దంగా చూపును ప్రభావితం చేసే గ్లకోమా | - | Sakshi
Sakshi News home page

నిశ్శబ్దంగా చూపును ప్రభావితం చేసే గ్లకోమా

Mar 11 2026 8:57 AM | Updated on Mar 11 2026 8:57 AM

మచిలీపట్నంఅర్బన్‌: నీటికాసులు (గ్లకోవూ) నిశ్శబ్దంగా చూపును ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యాధి అని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం గ్లకోమాపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లకోమా సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని, కుటుంబంలో ఎవరికై నా ఈ వ్యాధి ఉన్నట్లయితే ఇతరులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్‌ భానుమూర్తి మాట్లాడుతూ కనుగుడ్లు చుట్టూ రంగుల వలయాలు కనిపించడం, కంటి నొప్పి, చూపు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే గ్లకోమా అయ్యే అవకాశముందని చెప్పారు. సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే చూపును కాపాడుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ ఎం.నవీన్‌, డీఆర్‌ఓ చంద్రశేఖరరావు, మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement