ప్రజా కవి యోగి వేమన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన ప్రజాకవి యోగి వేమన అని పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా పోలీస్ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగి వేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడని అన్నారు. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్‌లో 49 ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నడవలేని వికలాంగులు, వృద్ధుల వద్దకే వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదు అందుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 25 ఫిర్యాదులు, కుటుంబ కలహాలపై 2, వివిధ మోసాలపై 2, మహిళా సంబంధిత నేరాలపై 2, దొంగతనాలపై 1, కొట్లాటలపై 2, వివిధ సమస్యలపై 15 ఫిర్యాదులు అందాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): పండుగ తిరుగు ప్రయాణం రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం మీదగా మళ్లించినట్లు మళ్లించినట్లు ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం తెలిపారు. దీంతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై సజావుగా ట్రాఫిక్ కొనసాగుతోందన్నారు. తిరుగు ప్రయాణాల్లో మూడో రోజు కూడా ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమస్య లేకుండా చూస్తున్నట్లు తెలిపారు.
జి.కొండూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జి.కొండూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జి.కొండూరులో గుర్తు తెలియని వ్యక్తి(సుమారు 35) ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రధాన రహదారిపై కూర్చున్నాడు. అయితే అదే సమయంలో మైలవరం వైపు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కుక్కను తప్పించబోయి రహదారిపై ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై చొక్కా లేకపోవడంతో మతిస్థిమితం లేక రహదారిపై తిరుగుతూ ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూర్చొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.
పెనమలూరు: కానూరు పప్పులమిల్లు వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరు పప్పులమిల్లు వద్ద గుర్తు తెలియని వృద్ధుడు(70) పడిపోయి ఉండటంతో స్థానికుల సమాచారం మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పెనమలూరు పోలీసులు కోరారు.
ప్రజా కవి యోగి వేమన
ప్రజా కవి యోగి వేమన
ప్రజా కవి యోగి వేమన
ప్రజా కవి యోగి వేమన


