ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు

Jan 20 2026 8:25 AM | Updated on Jan 20 2026 8:25 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు

ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు

ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు ● పెనమలూరుకు చెందిన నవీన్‌ అనే బాధితుడు ఎస్పీని కలిసి తన సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన స్నేహితుడు అక్షరాల మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడని తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు. అతనిపై చర్యలు తీసుకుని తన తమ్ముడికి న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదు చేశాడు. ● వడ్లమన్నాడుకు చెందిన కవిత అనే వివాహిత మీకోసంలో ఎస్పీని కలిసి రెండేళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని, అప్పటి నుంచి భర్త అతని తరఫు బంధువులు అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. వారి వేధింపుల నుంచి విముక్తి కలిగించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ● మచిలీపట్నంకు చెందిన సాల్మన్‌ అనే బాధితుడు తన సరిహద్దుదారుడు తన స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని, తన ఇంటికి సరిహద్దు గోడను నిర్మించుకున్నప్పటికీ కట్టించిన గోడను కూల్చి తమపై భౌతికదాడికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ వి.వి.నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కోనేరుసెంటర్‌: ప్రజా సమస్యలను పరిష్కరించటంలో రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎస్పీ మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను సామరస్యంగా ఆలకించటంతో పాటు అఽధైర్యపడొద్దు... మీకు మేమున్నామంటూ ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే తక్షణమే తన నోటీసులో పెట్టాలని సూచించారు. సమస్య ఎలాంటిదైనా బాధితుల తరఫున పోలీసులు ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఆ దిశగా మనమంతా పని చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించినా బాధితుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిసినా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో మొత్తం 25 అర్జీలు అందినట్లు తెలిపారు.

ప్రధానమైన అర్జీలు ఇవే...

మీకోసంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement