చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఘంటసాల బౌద్ధ స్థూపం
అంతర్జాతీయ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్‌వీ రామారావు
ఘంటసాల: ఘంటసాల గ్రామంలోని బౌద్ధ మహాస్థూపం, శిల్ప సంపదకు ఎంతో ప్రాశస్త్యం ఉందని అంతర్జాతీయ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్‌వీ రామారావు అన్నారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ మహాస్థూపం, బౌద్ధ మ్యూజియంలోని శిల్ప సంపదను, మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారిని, శ్రీకృష్ణ దేవరాయులు వారి ఆముక్త మాల్యద మండపాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి, నాగార్జున కొండలతో పాటు ఘంటసాల బౌద్ధ మహాస్థూపం, బౌద్ధ శిల్ప సంపదకు ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉందన్నారు. అనంతరం ఎస్వీ రామారావును యువనేత మండలి వెంకట్రామ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), అచ్చెంపాలెం సర్పంచ్ గాజుల శ్రీనివాసరావు దుశ్శాలువాతో సత్కరించారు. ఘంటసాల చరిత్ర, శ్రీజలధీశ్వర ఆలయం చరిత్ర పుస్తకాలను అందించారు.


