వక్ఫ్‌ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

Jan 20 2026 8:25 AM | Updated on Jan 20 2026 8:25 AM

వక్ఫ్‌ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

వక్ఫ్‌ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

వక్ఫ్‌ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి

పెనమలూరు: వక్ఫ్‌ భూములను ఆక్రమించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్‌ వక్ఫ్‌ షేక్‌ కరీముల్లా బాషా, ఎగ్జిక్యూ టివ్‌ అధికారి వక్ఫ్‌ షేక్‌ షంషుద్దీన్‌ కోరారు. తాడిగడప గ్రామంలో వక్ఫ్‌ భూములను సోమవారం వక్ఫ్‌ అధికారులు పరిశీలించి ఇన్‌చార్జి తహసీల్దార్‌ రాజును కలిశారు. వక్ఫ్‌ భూముల ఆక్రమణల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వక్ఫ్‌ అధికారులు మాట్లాడుతూ కొండపల్లి ఖాజీ సర్వీస్‌ భూమిలో తాడిగడప, పెదపులిపాక గ్రామమాల్లో సర్వే నంబర్లు 79, 87, 173, 176లలో దాదాపు 43 ఎకరాల సాగు భూమి ఉందని, గత ఏడాది వేసవిలో ఏక్‌సాల్‌ కౌలు లీజ్‌ వేలంపాట కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. తుది ఉత్తర్వులు కోర్టులో విచారణలో ఉన్నాయని, అయితే కొందరు వ్యక్తులు అక్రమంగా వక్ఫ్‌ భూముల్లోకి ప్రవేశించి సాగుకు నీరు పెడుతున్నారని తెలిపారు. వక్ఫ్‌ భూముల వద్ద తహసీల్దార్‌ హెచ్చరిక బోర్డు పెట్టినా ఆక్రమణ దారులు చొరబడుతున్నారని, కోర్టు ధిక్కారం కేసు అవుతుందని తెలిపారు. ఆక్రమణ దారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌ కూడా చర్యలు తీసుకుంటానని తెలిపారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement