ఎంతకై నా తెగిస్తారు..
మద్యం, గంజాయి తాగిన వారి మెదడులో డొపమిన్ అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది. అది వారి మెదడుకి హాయినిస్తుంది. అందుకే మళ్లీ, మళ్లీ తాగాలని చూస్తారు. అందుకోసం దేనికై నా తెగిస్తారు. డబ్బుల కోసం తల్లిదండ్రులపై దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. ఇప్పుడు జరుగుతున్న దాడులన్నీ అలాంటివే. వారి ప్రవర్తనలో మార్పుకోసం కౌన్సెలింగ్, మెడిటేషన్, జీవనశైలి మార్పులు వంటివి చేసుకోవాల్సి ఉంటుంది.
– డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్


