సాల్మన్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పల్నాడు జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సాల్మన్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళిత కార్యకర్త సాల్మన్ టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురవడం బాధాకరమన్నారు. ఈ హత్యకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నిందితులకు శిక్ష పడేలా పోలీసులు పనిచేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వైఎస్సార్ సీపీ తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు.


