ప్రజల్లో అవగాహన పెరగాలి..
బేసిక్ లైఫ్ సపోర్టు విధానాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి అవసరం ఉంది. ముఖ్యంగా సీపీఆర్ గురించి తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులో, స్నేహితులో మనముందు కుప్పకూలినప్పుడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తక్షణమే సీపీఆర్ చేస్తే శరీరంలో రక్తప్రసరణ జరిగేలా చేయవచ్చు. ఈ విధానంపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంచాల్సి ఉంది. కళాశాలల విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.
– డాక్టర్ మొవ్వ పద్మ, క్రిటికల్‌కేర్ నిపుణులు


