నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్‌కు సన్మానం
రిమ్మనపూడి(పామర్రు): నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్‌గా ఎంపికై న కంచర్ల నందకిషోర్ తన స్వగ్రామమైన పామర్రు మండల పరిధి రిమ్మనపూడి గ్రామానికి శుక్రవారం చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గ్రామానికి చేరుకుని ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం గ్రామంలో చైర్మన్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను నలుదిశలా వ్యాపింప చేసే విధంగా నంద కిషోర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింప చేసే విధంగా పల్లెటూరి నుంచి అమెరికా వంటి అగ్రరాజ్యంలో తెలుగు సొసైటీకి చైర్మన్‌గా ఎంపిక కావడం ఎంతో విశేషమని కొనియాడారు. రిమ్మనపూడి గ్రామాభివృద్ధికి నంద కిషోర్ సహాయ సహకారాలను అందించడం ఎంతో ప్రశంసనీయమన్నారు. అనంతరం నంద కిషోర్‌ను ఘనంగా చేశారు. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, కృష్ణామిల్క్ యూనియన్ విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, పామర్రు ఏఎంసీ చైర్మన్ జన్ను శోభన్‌బాబు, కూటమి నేతలు పాల్గొన్నారు.


