గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌స
పెనమలూరు: గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి కానూరు కేసీపీ సిద్ధార్థ ఆదర్శ పాఠశాల విద్యార్థి జె.శ్రీరామ్‌కు అవకాశం దక్కింది. ఏపీ 17వ బెటాలియన్‌కు చెందిన శ్రీరామ్ న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఏపీ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ సందర్భంగా పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ, ప్రిన్సిపాల్ సాయికృష్ణ, ఎన్‌సీసీ కమాండింగ్ అధికారులు హరిబాబు, పాండే తదితరులు అభినందనలు తెలిపారు.
కూచిపూడి(మొవ్వ): కూచిపూడి–పెడసనగల్లు రోడ్డులోని నన్నపనేని గ్రౌండ్స్‌లో మన ఊరు –మన సంక్రాంతి సందర్భంగా రెండు రోజుల పాటు సాగే జాతీయ పొట్టేళ్ల పందేలు సోమవారం ప్రారంభమయ్యాయి. నన్నపనేని యువసేన ఆధ్వర్యాన తొలిరోజు కర్ణాటక జాతి పొట్టేళ్ల పందేల్లో వందకు పైగా పొట్టేళ్లను హైదరాబాద్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల యజమానులు తీసుకువచ్చి పోటీల్లో పాల్గొన్నారు. నన్నపనేని వీరేంద్ర పర్యవేక్షణలో కొనసాగుతున్న పోటీలను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. కూచిపూడిలో సుమారు 60 ఏళ్ల క్రితం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు.
కోనేరుసెంటర్: మీ కోసంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీకోసంలో ఎస్పీ బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను ఎస్పీ అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
అర్జీల్లో కొన్ని..
అవనిగడ్డ నుంచి రాణి అనే బాఽధితురాలు ఎస్పీని కలిసి తనకు వివాహం జరిగి ఐదేళ్లు కాగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు చెప్పింది. ఆడపిల్లలు కావడంతో అత్తింటివారు పుట్టింటికి పంపించేసి తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నారని, అంతేకాక తనతో బలవంతంగా విడాకులు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారంటూ వాపోయింది. తనతో పాటు తన బిడ్డలకు న్యాయం చేయాలని ప్రాథేయపడింది.
–పెనమలూరుకు చెందిన వృద్ధుడు నాంచారయ్య తనకు ఇద్దరు మగ పిల్లలని, పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడని, అతని భార్య అత్తమామలమనే కనికరం లేకుండా తమ ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో ఉంటోందన్నారు. తమను వేధిస్తున్నారని న్యాయం చేయాలని కోరారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): దూరదృష్టి గల శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ వైద్య విజ్ఞానానికి ఎనలేని సేవలందించిన డాక్టర్ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సోమవారం రీసెర్చ్ డే వేడుకలు నిర్వహించారు. తొలుత యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సుబ్బారావు విగ్రహాన్ని వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం వైద్య రంగంలో విశిష్ట పరిశోధనలు చేస్తున్న పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులకు ఉత్తమ పరిశోధకుల అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆధునిక బయోకెమిస్ట్రీ పితామహుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డును సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ ,డైరెక్టర్ – కార్డియో వాస్క్యులర్ సర్జికల్ రీసెర్చ్, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లోకేశ్వరరావు సజ్జాకు ప్రదానం చేశారు. అనంతరం ఆయన ‘మెడికల్ రీసెర్చ్ – గతం, వర్తమానం, భవిష్యత్’ అంశంపై ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి, కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌స
గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌స
గణతంత్ర వేడుకలకు సిద్ధార్థ ఎన్‌స


