వైభవంగా ఘనరాగ పంచరత్న కీర్తనల గోష్టిగానం
విజయవాడకల్చరల్: సద్గురు సంగీత సభ, భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న 31వ త్యాగరాజస్వామి ఆరాధాన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. త్యాగరాజస్వామి రచించిన స్వరపరచిన ఘనరాగ పంచరత్న కీర్తనలు జగదానందకారక, దుడుకుగల, సాధించినే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు కీర్తనలను 200 మంది గాయకులు వాద్యకారుల సహకారంతో ఆలపించారు. వాగ్గేయకారుడు సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు, మోదుమూడి సుధాకర్, వేమూరి విశ్వనాథ్, గౌరీనాథ్, పారుపల్లి సుబ్బరాయ ఫల్‌గుణ్, గాయత్రీ గౌరీనాథ్, అంజనా సుధాకర్, మల్లాది కార్తీక త్రివేణి పంచరత్న కీర్తనల గోష్టిగానంలో పాల్గొన్నారు. స్వరార్చన కార్యక్రమంలో భాగంగా విద్యావైద్యనాథ్, పసుమర్తి పావని, పసుమర్తి పవిత్ర, అచల శంకరనాథ్(వీణ), కొత్తపల్లి వందన, విష్ణుభోట్ల సోదరీమణులు, సీవీపీ శాస్త్రి, పోపూరి శ్రీరాం చరణ్, చిట్టా కార్తీక్, చిట్టా దీపక్ త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఆలపించడంతో సంగీత ఉత్సవాలు ముగిశాయి.


