శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Jan 11 2026 9:51 AM | Updated on Jan 11 2026 9:51 AM

శ్రీన

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో ఉన్న భూ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భారీ అన్నసమారాధన జరిగింది. అన్నసంతర్పణను నిర్వహకులు కె. బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. మేఘా ఇంజి నీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆర్థిక సాయంతో ఈ అన్న సమారాధన జరిగిందని నిర్వాహకులు తెలిపారు. సర్వ పుష్పాలంకరణతో దర్శనమిచ్చిన స్వామికి విశేషాభిషాకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి.

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. పెన మలూరు మండలం కానూరు మైత్రినగర్‌కు చెందిన కొల్లూరి రామ్‌ప్రకాష్‌ కుటుంబం నిత్యా న్నదానానికి రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన భావన భాగ్యలక్ష్మి కుటుంబం రూ.1,00,101 విరాళం అందజేశాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన కిర్ల నాగవెంకట దుర్గానవీన్‌ కుటుంబం అమ్మవారి రూ.2,11,450 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంఅందించారు.

బకాయిలు విడుదల చేయాలని వినతి

లబ్బీపేట(విజయవాడతూర్పు): కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేసి సంక్రాంతి జరుపుకొనే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. లబ్బీపేటలోని తమ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు మండవ సాయి మాట్లాడుతూ.. బడ్జెట్‌ లేకుండా టెండర్లు పిలవడంతో బిల్లుల బకాయిలు పేరు కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతినాటికైనా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామన్నారు. బకాయిలు రూ.10 వేల కోట్లకు చేరాయని వివరించారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు చేశామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తమ విజ్ఞప్తిని మన్నించాలని కోరారు. అమరావతి పనుల్లో చిన్న, మధ్య తర గతి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి లింగం రవికిరణ్‌, కోశాధికారి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

‘లిఖిత’ సేవలు అభినందనీయం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీసుశాఖకు లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏలూరు రేంజ్‌ ఐజీపీ జి.వి.జి.అశోక్‌కుమార్‌ కొనియాడారు. కృష్ణాజిల్లా పోలీసుశాఖకు లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆధ్వర్యంలో అందజేసిన తొమ్మిది బొలేరో వాహనాలను ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్‌, కాగిత కృష్ణప్రసాద్‌, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీపీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ..ఈ వాహనాలను అవనిగడ్డ, బందరు రూరల్‌ స్టేషన్‌లకు ఉపయోగిస్తామన్నారు. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గట్టిపాటి శ్రీనివాసరావును ఐజీపీ, ఎస్పీ, ఎమ్మెల్యేలు కలిసి సన్మానించారు. బందరు డీఎస్పీ సీహెచ్‌. రాజ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు1
1/3

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు2
2/3

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు3
3/3

శ్రీనివాసుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement