నవల సెకండ్ ఎడిషన్‌కు వెళ్తున్నాను
నాది జగ్గయ్యపేట, నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నేను నా తొలి నవలగా ‘తుది శ్వాసే ప్రారంభం’ తీసుకొచ్చాను. మన ఆత్మీయులు చనిపోయినప్పుడు మనం చాలా కోల్పోయినట్లుగా భావిస్తాం. మన జీవితాలు అంతటితో అయిపోయాయని అనుకొని బాధపడతాం. కానీ అది సరికాదు. చిన్నచిన్న సమస్యలతో అంతా అయిపోయిందని అనుకుంటాం. అలాగే మహిళలు ఇలాగే ఉండాలి, ఇలా చేస్తేనే మంచివారు, ఇలా ఉంటేనే గౌరవం లభిస్తుందనే వాదనలు సైతం సరికాదు. మహిళలకు అస్థిత్వం ఉంటుంది. ఆ అంశాలను నా నవలలో వివరించాను. ఈ నవల మంచి ఆదరణ లభించింది. త్వరలోనే రెండో ఎడిషన్‌కు వెళ్తున్నాను.
– నందిని, యువ రచయిత్రి, జగ్గయ్యపేట


