జంగం దేవరుల జీవితాలను వివరించాను
మాది అనంతపురం జిల్లా. నేను నా ప్రాంతంలో దగ్గరగా చూసిన బుడుగు జంగం దేవరుల జీవితాలను వివరిస్తూ ‘జంగాల్’ పేరుతో నవలను తీసుకొచ్చాను. ప్రస్తుత సమాజంలో వారి పరిస్థితితో పాటుగా వారు తమ అస్థిత్వం కోసం పోరాడుతున్న తీరును సైతం దీనిలో వివరించే ప్రయత్నం చేశాను. చాలా బాగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇది నా మొదటి నవల. మరో నవల వచ్చే నెలలో ప్రచురింపబడుతుంది. నా నవలకు మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది ఆశీస్సులందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మున్ముందు మరిన్ని రచనలు తీసుకురావాలని బలంగా కోరుకుంటున్నాను.
– జీవన్ గుడిమిచెర్ల, యువరచయిత అనంతపురం


