టన్ను రేషన్ బియ్యం స్వాధీనం
కోడూరు: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ చాణిక్య తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని జరుగువానిపాలెం గ్రామానికి చెందిన పచ్చ నాగరాజు తన ఇంటి వద్ద రేషన్ బియ్యం నిల్వ చేశాడనే సమాచారంతో దాడి చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ దాడిలో 40 సంచుల్లో నిల్వ చేసిన వెయ్యి కేజీలు (టన్ను) రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాగరాజుపై కేసు నమోదు చేసి మధ్యవర్తుల సమక్షంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చల్లపల్లి: గ్యాస్ పొయ్యి వద్ద మంటలను ఆర్పబోయిన ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన మండల పరిధిలోని పురిటిగడ్డలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పురిటిగడ్డ గ్రామానికి చెందిన ఎన్.విమల కుమారి(80) శనివారం ఉదయం గ్యాస్ పొయ్యిపై టీ కాస్తుండగా రెగ్యులేటర్ వద్ద గ్యాస్ లీకు అయ్యి మంటలు వ్యాపించాయి. కంగారుపడిన విమలకుమారి వెంటనే తన చీరతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. ఇంతలో మంటలు చీరకు అంటుకుని వళ్ళంతా వ్యాపించటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి 108లో ఆమెను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.
కె. కొత్తపాలెం(మోపిదేవి): పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి కె.కొత్తపాలెంలో జరిగింది. ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మత్తి యోగి బాలవర్ధన్, చందన ప్రసాద్ గ్రామస్తులు. వీరి మధ్య గతంలో పాత కక్షలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి మత్తి యోగి బాలవర్ధన్ గ్రామంలో మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ మద్యం తీసుకుంటున్న సమయంలో చందన ప్రసాద్ కూడా మద్యం కోసం వచ్చాడు. కొంత సేపటి తర్వాత మద్యం తాగిన చందన ప్రసాద్ పాత గొడవల నేపథ్యంలో బాలవర్ధన్‌పై కత్తితో దాడి చేశాడు. దాడిలో బాలవర్ధన్ చేతి వేళ్లు తెగిపోయాయి. తలపై బలమైన గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. బాధితుడి భార్య బార్య మత్తి నాగభవాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ వివరించారు.
కృత్తివెన్ను: ఉప్పులూరు గ్రామంలో కోడికత్తులు కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి అతని నుంచి 70 కోడికత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ పైడిబాబు తెలిపారు. వచ్చిన సమాచారం మేరకు సోదా చేయగా గ్రామానికి చెందిన చెక్కా నాగరాజు అనే వ్యక్తి వద్ద కోడికత్తులు దొరికాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని ప్రివెన్షన్ ఆఫ్ క్రియాల్టీ టు యానిమల్ యాక్టు కింద కేసు నమోదు చేశామన్నారు. సంక్రాంతి పండుగ పేరుతో ఎలాంటి జూదాలు నిర్వహించిన, పాల్గొన్నా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని శెట్టిగుంట పంచాయతీ తిరుపతి–కడప జాతీయ రహదారిలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని విజయవాడకు చెందిన దుర్గారావు (52) అనే వ్యక్తి మృతి చెందాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించడానికి కోడూరులో ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
టన్ను రేషన్ బియ్యం స్వాధీనం
టన్ను రేషన్ బియ్యం స్వాధీనం


