సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్‌ఓ నుస్రత్ మండ్రుప్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (07473) రైలు ఈ నెల 11, 12 తేదీల్లో ఉదయం 7.55 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07474) ఈ నెల 10, 11 తేదీల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరి, అదేరోజు రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–విజయవాడ (07475) రైలు ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, అదేరోజు మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07476) ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో బయలుదేరి అదేరోజు రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
చల్లపల్లి: మండలంలోని గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు శనివారం నివాస గృహాలు, వ్యాపార సముదాయాల్లో తనిఖీలు చేశారు. రూ.6.44లక్షల జరిమానా విధించారు. తనిఖీల అనంతరం చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో జరిగిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. జిల్లా విద్యుత్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వాసు, ఉయ్యూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు బి.వి.సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు 27 బృందాలుగా ఏర్పడి 1971 నివాస గృహాలు, 186 వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అదనపు లోడు వినియోగిస్తున్న 225 సర్వీసులకు జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చల్లపల్లి, ఉయ్యూరు ఎడిఈలు ఎన్.సుబ్రహ్మణ్యేశ్వరరావు, జి.హేమకుమార్, ఏఈ జి.బసవశాస్త్రులు, డివిజన్ పరిధిలోని ఏఈలు, జెఈలు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


