ఉద్యోగాలకు 525 మంది ఎంపిక
నున్న(విజయవాడరూరల్): నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 525 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పరమేశ్వరరావు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఎకా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, కంపెనీ హెచ్‌ఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్‌మేళాను ప్రారంభించారు. జాబ్‌మేళాలో ఐటీ, నాన్‌ఐటీ, ఇన్ఫ్రా, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్‌లకు సంబంధించిన 19 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రఖ్యాత యాక్సెంచర్, బిర్లా సాఫ్ట్, కాన్సెంట్రిక్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎన్.నర్సిరెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌మేళాకు వివిధ జిల్లాల నుంచి 980 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పరమేశ్వరరావు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎం.గణేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.


