సమ్మోహనం.. స్వరరాగ సమ్మేళనం
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతికశాఖ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహిస్తున్న 31వ వార్షిక సంగీత మహోత్సవాలు స్వరరాగ సమ్మేళనంగా సాగుతున్నాయి. శనివారం నాటి కార్యక్రమంలో గంటి శాంభవి, వైఎస్ తమన్, రాజరాజేశ్వరి, లోళ్ళ జయరాం, అంబటిపూడి తులసి, భవ్యశ్రీ గీతిక, ఎన్‌జీఎస్ కీర్తన, పోపూరి శ్యామసుందర్, చింతలపాటి మంజుల, మాచిరాజు కీర్తనాశర్మ, ధూళిపాళ వాసవి, ఎస్.అమృత వర్షిణి, డాక్టర్ ద్వారం లక్ష్మి, పోపూరి గౌరీనాఽథ్, మల్లాది సూరిబాబులు త్యాగరాజ స్వామి స్వరపరచి రచించిన కీర్తనలను మధురంగా ఆలపించారు.నేటితో ఆరాధనా ఉత్సవాల ముగింపు: ఆదివారం నాటి కార్యక్రమంలో ఆరాధానా సంగీతోత్సవాలు ముగుస్తాయని అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ తెలిపారు.


