ఆటోని ఢీకొట్టిన కారు
పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కనుమూరు సంధ్యా ఆక్వా వద్ద ఆటోను కారు ఢీకొట్టిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న పంట బోదెలోకి ఆటో దూసుకెళ్లింది. దీనిలో ఉన్న భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులకు ఏవిధమైన గాయాలు కాలేదు. అదేవిధంగా కారు కూడా పల్టీ కొట్టి పక్కనే ఉన్న పంట బోదెలోకి వెళ్లింది. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయని, అదేవిధంగా కారులో ఇరుక్కుపోయిన వారిని స్థానికులు స్పందించి బయటికి తీశారు. వీరికి కూడా స్వల్ప గాయాలవడంతో దగ్గరలోని వైద్యశాలకు తరలించారు.


