యువ రచయితలు రావటం మంచి పరిణామం
యువ రచయితలు రావటం చాలా మంచి పరిణామం. కొన్ని సంవత్సరాలుగా యువత రచనల వైపు రావటం కనపడటం లేదు. చాలా మంది ఇతర రంగాల వైపు వెళ్లిపోతున్నారు. కొంతమంది యువత మంచి రచనలతో సాహిత్య రంగంలో అడుగులు వేస్తున్నారు. వారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అటువంటి వారిని అందరూ ప్రోత్సహించాలి. విజయవాడ పుస్తక మహోత్సవంలో కొత్త రచయితలు తమ రచనలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు. ఇదే విధంగా మరింతగా యు వరచయితలు ముందుకు రావాలి.
– టి.మనోహర్‌నాయుడు,
అధ్యక్షులు, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ


