సాగుతున్న పెండింగ్ పనులు
ప్రస్తుతం నున్న వద్ద అసంపూర్తిగా ఉన్న పనులను చేస్తున్నారు. అంబాపురం, జక్కంపూడి మధ్య ఉన్న లైన్లనే ఎత్తు పెంచే విధంగా ఒప్పందం కుదరడంతో, అక్కడ ఎత్తు పెంచే పనులు సాగుతున్నాయి. గొల్లపూడి, చిన అవుటుపల్లి వద్ద జాతీయ రహదారులను అను సంధా నించే పనులు జరుగుతున్నాయి. మూడు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నా ప్రస్తుతం వాహనాలను బైపాస్ పైకి అనుమతిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సర్వీసు రోడ్డు మీదుగా ప్రస్తుతం వాహనాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 10వేల వాహనాలకు పైగా బైసాస్‌పై ప్రయాణిస్తున్నాయి. సంకాంత్రి పండుగ సమయంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం వైపు వెళ్లే వాహనాలన్నీ విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది.


