కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jan 8 2026 6:24 AM | Updated on Jan 8 2026 6:24 AM

కృష్ణ

కృష్ణాజిల్లా

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026 ఎన్టీఆర్‌ జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లు గుర్తింపు దుర్గమ్మ సేవలో రాజేంద్రప్రసాద్‌ కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు కార్తికేయుడి హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు రహదారులకు ప్రాధాన్యం

న్యూస్‌రీల్‌

వచ్చే వారం ఈ–టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు ఇప్పటికే రెండు రీచ్‌ల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలు 8 ఇసుక డిపోల్లో 7 లక్షల టన్నులకు పైగా నిల్వలు తెలంగాణకు పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక తరలింపు

కలిసొచ్చిన చెక్‌పోస్టుల ఎత్తివేత

చెలరేగిపోతున్న అక్రమార్కులు

గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
ఎన్టీఆర్‌ జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లు గుర్తింపు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మను సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సంక్రాంతి పండగకు ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ హెచ్చరించారు. చట్టాలపై గ్రామాల నుంచి జిల్లాస్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి కమిటీలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వీఆర్వో, తహసీల్దార్‌, ఆర్డీఓల సారథ్యంలోని కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎక్కడా కోడి పందేలు జరగకుండా చూడాలన్నారు. జంతు సంక్షేమ సంఘాల సలహాలు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు.

14 నుంచి జంతు సంక్షేమ పక్షోత్సవాలు

ఈ నెల 14 నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు. జంతు సంక్షేమ సంస్థలు, జంతు సంక్షేమ సంఘాలతో పాటు రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖల అధికా రులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఈఓ ఎల్‌.చంద్రకళ, జంతుసంక్షేమ సంస్థల ప్రతినిధులు రవికుమార్‌, వెంకటేశ్వర్లు, శ్రీపద్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి హుండీల్లో భక్తులు సమ ర్పించిన కానుకల ద్వారా రూ.1,07,20,970 ఆదాయం వచ్చిందని ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌.వి.సాంబశివరావు, మచిలీపట్నం డివిజన్‌ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బుధవారం ఉదయం హుండీ కానుకలు లెక్కించగా 84 రోజులకు రూ.1,07,20,970 ఆదాయం వచ్చింది. 1.830 కిలోల వెండి, 44.81 గ్రాములు బంగారం, 98 ఆమెరికా డాలర్లు, సౌదీ అరే బియా, కెనడా, సింగపూర్‌, బూటాన్‌, మంగో లియా, నేపాల్‌ దేశాల కరెన్సీ లభించింది. ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు, సేవా సమితి సభ్యులు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 16 వేల కిలోమీటర్ల మేర రహదారులకు రూ.1,081 కోట్లతో మరమ్మతులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్దనరెడ్డి అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో బుధవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.3,380 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే టెండర్లు పిచామని తెలిపారు. కృష్ణాజిల్లాలో రూ.160 కోట్లతో 1518 కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు, మచిలీపట్నం నియోజకవర్గంలో రూ.33 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు.

హార్బర్‌కు నడకుదిటి పేరు..

మచిలీపట్నం పోర్టు పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని, డిసెంబర్‌ నాటికి ఆపరేషన్‌లోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రులు తెలిపారు. గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మా ణంలో సాంకేతికంగా సమస్యలు వచ్చాయని జూన్‌ నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. హార్బ ర్‌కు మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు పేరును పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామమన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం. రామకృష్ణ, జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో చంద్రశేఖర రావు, బందరు ఓడరేవు సీఈ రాఘవరావు, రహదారులు, భవనాలశాఖ సీఎస్‌సీ ఎన్‌.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ భాస్కర్‌, డీఈ లోకేష్‌, మెగా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిధి తులసీదాస్‌ పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లాలో కొత్త రీచ్‌లను గుర్తించిన అధికారులు, వాటిలో ఇసుక తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఐదు రీచ్‌లను గుర్తించి, వాటికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. వచ్చే వారం ఈ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌లను ఏజెన్సీల ద్వారా నిర్వహించేందుకు ఈ–టెండర్లు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో 15 ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇచ్చారు. వీటి గడువు గత ఏడాది అక్టోబర్‌ 15వ తేదీతోనే ముగిసింది. ప్రస్తుతం కేవలం జిల్లాలో రెండు రీచ్‌లకు మాత్రమే అనుమతి ఉంది. కాసరాబాద, పొక్కునూరులో రీచ్‌లకు సంబంధించి రెండు లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం అనుమతులు వచ్చిన మల్కాపురం రీచ్‌లో 74,250 టన్నులు, ఏటూరులో 74,850, మున్నలూరులో 74,400, గనిఅత్కూరు 73,500, పొక్కనూరులో 2.04 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. పొక్కునూరు మినహా మిగిలిన నాలుగు రీచ్‌ల్లో కూలీల ద్వారానే ఇసుక లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేయాల్సి ఉంటుంది. పొక్కనూరులో మాత్రం సెమీ మెకనైజ్డ్‌ ద్వారా ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసుకొనే అవకాశం కల్పించనున్నారు.

ఆగని ఇసుక దోపిడీ

గత ఏడాది వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు డిపోల్లో ఇసుక నిల్వలు ఉంచారు. అయితే డిపోల్లోని ఇసుక అమ్మకాలు నామ మాత్రంగానే సాగాయి. మోగులూరు, కంచల, కీసర, ట్రక్‌ టెర్మినల్‌, వేములపల్లి, అల్లూరుపాడు, భవానీపురం, ఏటూరు ఇసుక డిపోల్లో ఏడు లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇసుక అక్రమ దోపిడీ మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాసరాబాద, పొక్కునూరు ఇసుక రీచ్‌లు పార్లమెంటు ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీల్లో ఇసుక లోడింగ్‌ చేయాలంటే రూ.10 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలిస్తున్నారు. పచ్చనేతల కనుసన్నల్లోనే ఇసుక దందా నడుస్తుండటంతో పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక దందాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప, క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావటం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

సందర్శకులతో కిటకిటలాడుతున్న విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌

7

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక బోర్డర్‌ చెక్‌ పోస్టులను ఎత్తివేయడం ఇసుక మాఫియాకు కలిసొచ్చింది. అడ్డుకునే వారే లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా గంపలగూడెం మండలంలోని కనుమూరు, వినగడప, తిరువూరు మండలంలోని గానుగపాడు, రోలుపడి గ్రామాల పరిధిలో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో భారీ గుంతలు ఏర్పడి కట్టెలేరు స్వరూపమే మారింది. మునేరు పరీవాహక ప్రాంతాల నుంచి సైతం తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతోంది. సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని అధికా రులు హంగామా చేయడమే తప్ప ఫలితం మాత్రం లేదు. రాత్రిళ్లు డొంక మార్గాల ద్వారా తెలంగాణకు ఆంధ్ర ఇసుక తరలి వెళుతోంది. ఖమ్మం ప్రాంతంలో లారీ ఇసుక ధర రూ.35 వేలు, ట్రాక్టరు ఇసుక ధర రూ.7 వేల నుంచి రూ.9 వేల చొప్పున పలుకుతోంది. దీంతో ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఆ ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక అంశాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాగుల్లో ఇసుకను సమీప గ్రామాల ప్రజలు తమ అవసరాలకు కూలీలతో లోడింగ్‌ చేసుకొని ఉచి తంగా తరలించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఉచిత విధానం. ఈ విధానం ఇసుక మాఫియాకు వరంగా మారింది. తిరువూరు, గంలగూడెం మండలాల్లో కట్టెలేరు ప్రవహిస్తోంది. ఇక్కడ పార్లమెంటు ప్రజా ప్రతినిధి అనుచరులు యథే చ్ఛగా ఇసుక తవ్వకాలు సాగి స్తున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేసి రూ.లక్షలు దండుకొంటున్నారు.

కృష్ణాజిల్లా1
1/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా9
9/10

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా10
10/10

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement