రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

Jan 8 2026 6:22 AM | Updated on Jan 8 2026 6:22 AM

రహదార

రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నం నియోజకవర్గంలో రూ. 39కోట్లతో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, మంత్రి కొల్లు రవీంద్రతో కలసి బుధవారం స్థానిక కాలేఖాన్‌పేటలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ. 33 కోట్ల నిధులతో మచిలీపట్నంనుంచి కమ్మవారి చెరువు వయా చిన్నాపురం డబుల్‌ లైన్‌ రోడ్డు విస్తరణ పనులకు, రూ. 6 కోట్ల నిధులతో మచిలీపట్నం శివగంగ దేవాలయం నుంచి చిన్నాపురం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిన్నాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు పాల్గొన్నారు. ఏపీ ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లి రైల్వే స్టేషన్‌ పరిశీలన

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి రైల్వే స్టేషన్‌లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఎంపీ కేశినేని శివనాఽథ్‌, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ రైల్వే అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కొండపల్లి నుంచి విజయవాడ వరకు రైల్వే ట్రాక్‌ వెంబడి డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి ఇప్పటికే రూ.10కోట్లు ప్రతిపాదనలు పంపా మన్నారు. రానున్న రోజుల్లో స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొన్నారు. త్వరలో రైల్వే స్టేషన్‌కు నూతన హంగులు సంతరించుకుంటాయని ఎమ్మెల్యే వసంత తెలిపారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

పోలీసు సిబ్బందికి ముగిసిన మూడు రోజుల శిక్షణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్‌నేరాలు, సోషల్‌ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారం ముగిసింది. ఈ శిక్షణలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల అధికారులు, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది 130 మంది పాల్గొన్నా రు. ఈ శిక్షణలో సైబర్‌ ఇంటిలిజెన్స్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల, మనిషి యాదవ్‌, కృష్ణ కిరణ్‌, సంజయ్‌ కుమార్‌, కరుణాకర్‌ రెడ్డి, శివ కుమార్‌, ప్రసన్న లక్ష్మి పలు అంశాలపై శిక్షణ ఇవ్వగా, వా రిని సీపీ రాజశేఖరబాబు సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ వల్ల ఆయా కేసులను త్వరితగతిన అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, దర్యాప్తులో కచ్చితమైన సాక్ష్యాలను సేకరించి నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.

ఆటోను ఢీకొట్టిన లారీ

ఉపాధ్యాయురాలితో పాటు ఆమె భర్త మృతి

జగ్గయ్యపేట అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు, ఆమె భర్త మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జగ్గయ్యపేట పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల(బాలురు)లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న వడ్డాది వెంకటరత్నం(38)భర్తతో కలిసి ఖమ్మం జిల్లా వైరాలో నివాసముంటున్నారు. అక్టోబర్‌ నెలలో హిందీ టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. వైరా నుంచి రోజూ విధులకు హాజరవుతున్నారు. భర్త రాము ట్రాలీ ఆటోలో దుప్పట్లు, పరుపులు వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు భార్యను కూడా ఆటోలో తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పాఠశాలలో స్టడీ అవర్స్‌ అనంతరం భర్తతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్తుండగా వైరా మండలం సోమవారం గ్రామ సమీపంలో ఆటో ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన భర్త రాము(43)ను అంబులెన్స్‌లో ఖమ్మంలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారికి ఇద్దరు కుమారులు కాగా ఒకరు 10, మరొకరు 7వ తర గతి చదువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఉద్యోగం వచ్చిన నెలల వ్యవధిలోనే..

మృతదేహాలను జగ్గయ్యపేట పాఠశాల నుంచి ప్రిన్సిపాల్‌ టి. ఉమేష్‌బాబుతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది వైరా వెళ్లి పరామర్శించటంతో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. పెళ్లి తరువాత ఎంతో కష్టపడి డిస్టెన్స్‌లో చదువుకుని ఆంధ్రాతో పాటు తెలంగాణ డీఎస్సీలో కూడా ఉద్యోగం సాధించిన నెలల వ్యవధిలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం కుటుంబ సభ్యులతో పాటు మమ్మల్ని ఎంతో కలిచి వేసిందని ప్రిన్సిపాల్‌ ఉమేష్‌బాబుతో పాటు తోటి ఉపాధ్యాయులు తెలిపారు.

రహదారుల నిర్మాణానికి  శంకుస్థాపన 1
1/2

రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

రహదారుల నిర్మాణానికి  శంకుస్థాపన 2
2/2

రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement