అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. కంకిపాడు పట్టణంలోని బీబీఆర్ నగర్‌కు చెందిన వల్లెపు సత్తిరాజు(45) కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 4వ తేదీన తీవ్ర మనస్తాపానికి గురై ఎలుకల మందు పేస్ట్ తిన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్తిరాజు మృతి చెందా డు. ఆస్పత్రి వర్గాల సమాచారం, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మంగళవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
పెనమలూ రు: బందరు కాలువలో మహిళ దూకి గల్లంతైన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు తులసీనగర్‌కు చెందిన దోనేపూడి పుష్పావతి(67) కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కుమారుడి వద్ద ఉంటుంది. కాగా కుమారుడు టీడీపీ నాయకుడు దోనేపూడి రవికిరణ్ గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. తల్లి ఇంట్లోనే ఉంది. శ్రీ శైలం నుంచి మంగళవారం తిరిగి ఇంటికి రాగా తల్లి ఇంట్లో కనబడలేదు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కాగా తాడిగడప పాత వంతెన వద్ద మహిళ మంగళవారం బందరు కాలువలో మహిళ దూకినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వంతెన వద్దకు చేరుకున్న ఎస్‌ఐ రమేష్ పరిశీలించగా వంతెన వద్ద చెప్పుల జత ఉండటంతో పుష్పావతివిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. బందరు కాలువలో దూకిన ఆమె కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. అయితే రాత్రి వరకు ఆమె ఆచూకీ దొరకలేదు.
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి


