ఒత్తిడిని అధిగమించవచ్చు..
అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక రుగ్మతలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అయితే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మానసిక వైద్యులను సంప్రదించేందుకు వెనుకాడకూడదు. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.
– డాక్టర్ అశోక్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు
ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. వారిపై సెల్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. వాటిని అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్ట లేకపోతున్నారు. యువత దేనినైనా అవసరం మేరకు వినియోగించడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఉల్లాసం కోసం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆటలు వంటి వాటిపై దృష్టి సారించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు
●
ఒత్తిడిని అధిగమించవచ్చు..


