వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి
సీఎండీ పుల్లారెడ్డి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ విని యోగదారులకు నాణ్యమైన సేవలు అందించా లని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ సర్వీసులు త్వరితగతిన విడుదల చేయాలన్నారు. ప్రజలకు 24 గంటలూ నిరంతరా యంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. బిల్లింగ్ సకాలంలో పూర్తి చేయాలని, రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని, ఫీడర్ల బ్రేక్ డౌన్ లేకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టరు టెక్నికల్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు, ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్ రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌వో నుస్రత్ మండ్రు ప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – చర్లపల్లి (08513) ప్రత్యేక రైలు ఈనెల 18వ తేదీన రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08514) ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
పలు రైళ్లు రద్దు
ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు. 13వ తేదీన నర్సాపూర్ – చర్లపల్లి (07254), 17న చర్లపల్లి – నర్సాపూర్ (07233), 19న వికా రాబాద్ – నర్సాపూర్ (07260), వికారాబాద్ – కాకినాడ టౌన్ (07287), 20న వికారాబాద్ – నర్సాపూర్ (07266), వికారాబాద్ – కాకి నాడ టౌన్ (07286) రైళ్లు పూర్తిగా రద్దయ్యాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
శ్రీకాళహస్తి: విజయవాడ నగరానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని మనస్తపం చెంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు, ఉషశ్రీ దంపతులు వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయారు. అప్పులు తీర్చాలని రుణ దాతలు వత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడు సాయి రాజేష్(17), సాయి దీక్షిత (13)తో కలిసి వెంకటేశ్వర్లు, ఉషశ్రీ దంపతులు మూడు నెలల క్రితం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. పట్టణంలోని కొండమిట్టలో ఓ అద్దె ఇంటిలో ఉంటూ, ముక్కంటి ఆలయం సమీ పంలోని హోటల్‌లో పనిచేస్తూ జీవిస్తున్నారు. అప్పులు ఇచ్చిన వారు శ్రీకాళహస్తిలో వీరి ఆచూకీని గుర్తించారు. ఆదివారం వారి ఇంటి వద్దకు చేరుకుని డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు, ఉషశ్రీ తమ ఇద్దరు పిల్లలతో కలిసి అదే రోజు అర్ధరాత్రి సమయంలో మందు తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వారిని స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసే విచారిస్తున్నామని తెలిపారు.
విజయవాడలీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవాని మంగళ వారం తీర్పునిచ్చారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో నివసించే మహిళకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె చిన్న కుమార్తె (8)తో ఇంటిపక్కన నివసించే రావూరి వెంకటేశ్వరరావు (50) 2019 మే నెల 31న అసభ్యంగా ప్రవర్తించాడు. గతంలో కూడా ఆ బాలికపై వెంకటేశ్వరరావు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గడ్డం రాజేశ్వరరావు, కృష్ణవేణి, ప్రస్తుత నార్త్ ఏసీపీ కె.స్రవంతిరాయ్‌తో పాటు సీఐల పర్యవేక్షణలో మొత్తం 12 మంది సాక్షు లను విచారించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం విజయవాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవాని నిందితుడికి కఠిన శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షలు నష్ట పరిహారంగా అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు.


