ఆవకాయ్ ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్ద పీట
భవానీపురం(విజయవాడపశ్చిమ): రేపటి నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్న ఆవకాయ్ అమరావతి (సినిమ, సంస్కృతి, సాహిత్యం) ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్ద పీట వేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఉత్సవాలకు సంబంధించి మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమన్వయ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సంద ర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఉత్సవాల నిర్వహణలో అనుభవం ఉన్న టీమ్‌వర్క్ సంస్థ భాగస్వామ్యంతో ఆవకాయ్ అమరావతి నిర్వహిస్తున్నామని తెలిపారు. పున్నమి ఘాట్‌తోపాటు భవానీ ద్వీపంలో కూడా వినూత్న కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 20 సెక్టార్లకు సంబంధించి ఒక్కో సెక్టార్‌కు జిల్లా అధికారితో పాటు రెవెన్యూ, పోలీస్, వీఎంసీలకు చెందిన అధికారులు, సిబ్బందితో బృందాలను నియమించామని వివరించారు. ఉత్సవాలకు ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చని, వేదికల వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్‌కు వీలుకల్పించామని తెలిపారు. ఆధు నిక సాంకేతిక సహాయంతో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకు భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ రాజ శేఖరబాబు తెలిపారు. ఏపీటీఏ డెప్యూటీ సీఈఓ ఎ.శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, టీమ్‌వర్క్ సంస్థ ప్రతినిధి సయ్యద్ శ్యామ్, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా టూరిజం అధికారి ఎ.శిల్ప, వీఎంసీ ఏడీసీ డాక్టర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


