రసవత్తరంగా పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రెండో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ పోటీలు మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నెల ఐదో తేదీన ప్రారంభమైన ఈ పోటీలు 11వ తేదీ వరకు కొనసాగుతాయి. త్వరలో జరగనున్న సౌత్‌జోన్ క్రికెట్ జట్టు సెలక్షన్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నాలుగు రేంజ్‌ల నుంచి 11 క్రికెట్ టీమ్‌లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. రెండో రోజు మంగళవారం డీవీఆర్ గ్రౌండ్‌లో ఏపీఎస్పీ రేంజ్–2, ఇంటిలిజెన్స్ టీమ్‌లు తలపడగా, ఏపీఎస్పీ టీమ్ పది వికెట్లు కోల్పోయి 109 రన్స్ స్కోర్ చేసింది. అనంతరం ఇంటిలిజెన్స్ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజేతగా నిలిచింది. చుక్కపల్లి పిచ్చయ్య గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో అనంత పూర్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా, సీఐడీ టీమ్ ఆరు వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో అనంతపూర్ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఏసీబీ జట్టుకు ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా మినిస్ట్రీరియల్ స్టాఫ్ జట్టు 84 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. మరో పోటీలో ఆపరేషన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈగట్ జట్టు 107 పరుగులకు ఆలౌటై ఓటమి చెందింది.


