వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కార్యాలయానికి కొలతలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో నిర్మించిన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం కొలతలు వేశారు. మునిసిపల్ కమిషనర్ సీహెచ్.వి.వి.ఎస్.బాపిరాజు పర్యవేక్షణలో కొలతలు వేశారు. కార్యాలయ కొలతల కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కొలతలు వేస్తున్నామని కమిషనర్ బాపిరాజు మీడియాకు తెలిపారు. అయితే హైకోర్టు పూర్తి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో మాత్రం చెప్పకుండా దాటవేశారు. కార్యాలయం బయటి కొలతలను సిబ్బంది తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏసీపీ హరి ప్రసాద్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
హైకోర్టు ఆదేశాలు అని చెప్పిన
మునిసిపల్ కమిషనర్


