ఉత్సాహంగా సిప్ అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్
భవానీపురం(విజయవాడపశ్చిమ): సోషియబుల్ ఇంటలెక్చువల్ అండ్ ప్రోగ్రెసివ్ (సిప్) అకాడమీ రాష్ట్ర స్థాయి అర్థమెటిక్ జీనియస్ కాంటెస్ట్ సీజన్–10 కార్యక్రమం ఆదివారం కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగాయి. ఈ పోటీలో వివిధ జిల్లాల్లోని పాఠశాలల నుంచి సుమారు 1050 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన విద్యార్థులు ఫిబ్రవరి 1న చైన్నెలో జరిగే నేషనల్ లెవెల్ పోటీలకు హాజరవుతారు. ఈ సందర్భంగా సిప్ స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాకినేని మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సిప్ అబాకస్ రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ పోటీలు పిల్లల్లో ఏకాగ్రత, దృశ్య జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయన్నారు. గత 22 ఏళ్లల్లో సిప్ అబాకస్ 10లక్షలకుపైగా పిల్లలకు శిక్షణ ఇచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఏరియా హెడ్స్ జమీర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రాంచైజీల నిర్వాహకులు పాల్గొన్నారు.


