నవజాత శిశువులకు ఆధునిక చికిత్సలపై సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నవజాత శిశువులకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం, అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్సలపై అను మై బేబీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్‌తో కలిసి ఎనికేపాడులోని ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సును అను హాస్పటల్స్ గ్రూప్ ౖచైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 400మందికి పైగా వైద్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ నవజాత శిశువుల వైద్యంలో ఎన్నో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ చికిత్సలతో శిశుమరణాల రేటును గణనీయంగా తగ్గిందన్నారు. సదస్సులో ఎన్‌ఆర్‌పీ, పిడియాట్రిక్ రీససిటేషన్ అండ్ ఎఫ్‌బి ఆస్పిరేషన్, ఇంటుబేషన్‌లతోపాటు, నియోనాటాలజీ ఎమర్జెన్సీస్, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్ ఎమర్జెన్సీస్‌లపై నిపుణులు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. కార్యక్రమంలో అను మైబేబీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీదేవి, డైరెక్టర్లు డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్, కె.రవికుమార్, పిడియాట్రిక్ టీమ్ డాక్టర్ బి.రేవంత్, డాక్టర్ ఎం.ఎన్.శ్వేత, డాక్టర్ గోవింద రాజులు, డాక్టర్ జోత్స్న ముత్యాల, డాక్టర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


