దేశభవిష్యత్‌లో యువత భాగస్వాములు కావాలి
కమలానందభారతి
విజయవాడ కల్చరల్: ౖహెందవజాతిని జాగృత పరచాలని భువనేశ్వరి పిఠాధిపతి కమలానందభారతి అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీఆర్‌టీఎస్ రోడ్డులోని శంకరామార్గ్‌లో ఆదివారం హైందవ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కమలానంద భారతి మాట్లాడుతూ నేటి యువత దేశ భవిష్యత్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. భారతదేశ సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం దేశ భవిష్యత్ రూపురేఖలను సమూలంగా మార్చివేసిందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆంధ్రప్రదేశ్ ప్రచారక్ విజయాదిత్య మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కలమతాలకు ఆతీతంగా పనిచేస్తోందన్నారు. హైందవ చైతన్యమే భారత సంక్షేమమని పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజలతోమమేకమై పనిచేస్తోందని వివరించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన డాక్టర్ కుందా శ్రీధర్, ఉపదృష్ట అనూరాధ ప్రసంగించారు. తొలుత శోభాయాత్రను నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్తగా నాగలింగం శివాజీ వ్యవహరించారు.


