
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
పెనమలూరు: మండలంలోని కానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు.. కానూరు కామయ్యతోపు ప్రాంతా నికి చెందిన చిలికోటి సరోజిని(65) మంగళవారం రాయల్ ఫర్నిచర్ షాపు వద్ద బందరు రోడ్డు దాటుతుండగా వేంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరోజిని అపస్మారకస్థితికి చేరుకుంది ఆమెను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.