రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుళ్ల పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో ఉపయోగించటం ద్వారా అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వస్తున్నాయి. అనుభవం లేని కార్మికులచే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుళ్ల పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. ఆ పేలుళ్లకు ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. పేలుళ్ల సమయంలో రాళ్లు లేచి జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సైతం తీవ్రగాయాలైన సంఘటనలు సాధారణమైంది.